Tuesday, January 13, 2026
E-PAPER
Homeబీజినెస్డిసెంబర్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం

డిసెంబర్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం

- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ మూడు నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. 2025 డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 1.33 శాతానికి చేరింది. సోమవారం గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్‌ ప్రకారం.. ఇంతక్రితం నవంబర్‌లో 0.71 శాతంగా నమోదయ్యింది. గడిచిన డిసెంబర్‌లో అహారోత్పత్తుల ధరలు 2.71 శాతంగా చోటు చేసుకున్నాయి. నవంబర్‌లో 3.91 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వరుసగా 22.20 శాతం నుంచి 18.47 శాతానికి దిగివచ్చాయి. దుస్తులు, పాదరక్షల విభాగంలో ద్రవ్యోల్బణం నవంబర్‌ నెలలో 1.49 శాతంగా ఉండగా, డిసెంబర్‌ 2025లో 1.44 శాతానికి తగ్గింది. డిసెంబర్‌ 2024లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.7 శాతంగా ఉంది. గృహ నిర్మాణ రంగంలో కూడా ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.95 శాతంగా ఉండగా, డిసెంబర్‌ 2025లో 2.86 శాతానికి తగ్గింది. ఇంధన ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతంతో పోలిస్తే డిసెంబర్‌ 2025లో 1.97 శాతంగా నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -