- Advertisement -
- – మండల విద్యాధికారి చంద్రుడు..
నవతెలంగాణ – వెల్దండ
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో పాఠశాల యజమాన్యాలు విద్యార్థులకు పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులు తప్పనిసరిగా సమకూర్చాలని మండల విద్యాధికారి చంద్రుడు అన్నారు. శనివారం వెల్దండ ఎమ్మార్సీ కార్యాలయంలో వెల్దండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో, ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మండల విద్యాధికారి చంద్రుడు మౌనిక వసతుల కల్పన పై పలు సూచనలు సలహాలు అందజేశారు. ప్రధానంగా విద్యార్థులకు కావలసిన త్రాగునీరు, టాయిలెట్స్ , ప్లే గ్రౌండ్ తదితర అవసరాలు తీర్చేలా పాఠశాల ప్రాంగణం ఉండాలన్నారు.
- Advertisement -



