Sunday, July 20, 2025
E-PAPER
Homeసినిమాషూటింగ్‌లో షారూక్‌కి గాయాలు

షూటింగ్‌లో షారూక్‌కి గాయాలు

- Advertisement -

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూక్‌ఖాన్‌ షూటింగ్‌లో గాయపడినట్లు సమా చారం. ఆయన హీరోగా తెరకెక్కు తున్న ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగు తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారూక్‌ అమెరికా వెళ్ళినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా షారూక్‌ స్టంట్‌ చేస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయని, అయితే అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం అని ఆ కథనాలు పేర్కొన్నాయి. అలాగే షారూక్‌ని కనీసం నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కూడా తెలిపాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ‘కింగ్‌’ సినిమా షూటింగ్‌ను రెండు నెలల పాటు చిత్ర బృందం వాయిదా వేసిందట.
షారూక్‌ ఖాన్‌, ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌’. యాక్షన్‌ కథా నేపథ్యంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కి స్తున్నారు. ఇందులో సుహానాకు తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ కనిపించ నుండగా, దీపికా పదుకొనె, అభిషేక్‌ బచ్చన్‌, జాకీ షరాఫ్‌, అనిల్‌కపూర్‌, రాఘవ్‌ జుయాల్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -