Wednesday, November 26, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్పంచ్ రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం

సర్పంచ్ రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం

- Advertisement -

బీఆర్ఎస్ నాయకులు గాజుల విక్రమ్
నవతెలంగాణ – కాటారం
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 % శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 17 % శాతం తగ్గించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బీసీ ప్రజానీకానికి తీవ్రమైన అన్యాయం చేశారని మండల బీఆర్ఎస్ నాయకులు గాజుల విక్రమ్ ఆరోపించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కాటారం మండలంలో ఉన్న 24 గ్రామపంచాయతీ స్థానాలకు గానూ బీసీలకు కేవలం 2 స్థానాలు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కులగణన పేరుతో వందల కోట్ల రుపాయలు దేనికి ఉపయోగపడే కార్చు చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -