Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌లో యువతకు అన్యాయం : ఏఐవైఎఫ్‌

బడ్జెట్‌లో యువతకు అన్యాయం : ఏఐవైఎఫ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువజన రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందనీ, యువతపై బాధ్యత లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలి ఉల్లాకాద్రి, కల్లూరు ధర్మేంద్ర విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌గల సత్య నారాయణ రెడ్డి భవన్‌ లో ఏఐవైఎఫ్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. నిరుద్యోగభృతిపై కనీస ప్రస్తావన లేదని విమర్శించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిధులు దుర్వినియోగం చేస్తున్నారనీ, అందులో యువత భాగస్వామ్యం లేదని ఆరోపించారు. క్రీడా రంగానికి కేటాయింపులు పరిమితంగా ఉండటం వల్ల గ్రామీణ యువతకు అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. గ్రామ స్థాయిలో క్రీడా మైదానాల కొరత, పేద క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం, వ్యాపార క్రీడలకు ప్రాధాన్యం పెరగడం ఇవన్నీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. జాబ్‌క్యాలెండర్‌ ఏమైందని ప్రశ్నించారు. ఇలాగే పాలన కొనసాగితే యువత కాంగ్రెస్‌ను ఓడించడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నేర్లకంటి శ్రీకాంత్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు టి. సత్య ప్రసాద్‌, మహేందర్‌, బిజ్జ శ్రీనివాసులు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -