నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గణేష్ నిమజ్జోత్సవ ఏర్పాట్లను తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి చింతా రాజా శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. గ్రామంలోని కుడుగుంట్ల చెరువు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద నిమజ్జోనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. మండలంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు.
కుడుగుంట్ల చెరువు, వరద కాలువ వద్ద నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి గంగా జమున, సిబ్బందిని ఆదేశించారు. గణపతి నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని లైటింగ్ ఏర్పాటు చేయించాలని సూచించారు. చెరువులో నీటిమట్టం, వరద కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, పంచాయతీ కార్యదర్శి గంగాజమున, స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES