- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్ : మండలంలోని ఈదులూరు, నారెగూడెం గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పరిషత్ సీఈవో బి. శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి పి జ్ఞాన ప్రకాష్, మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్, ఏపియం రాములు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు
- Advertisement -



