నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామం నుండి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి వెళ్లే దారిలో అవెన్యూ ప్లాంటేషన్ లో రిప్లేస్మెంట్ పనులను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా గతంలో నాటిన మొక్కలు ఎక్కడైనా ఎండిన, చనిపోయిన వాటి స్థానంలో కొత్తగా ప్రస్తుతం నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. అవన్నీ ప్లాంటేషన్ లో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. ప్లాంటేషన్ పరిధిలో ఎక్కడైనా మొక్క ఎండిన, చనిపోయిన వెంటనే రిప్లేస్మెంట్ చేయాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. గ్రామంలో వనమహోత్సవం విజయవంతం అయ్యేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి, కరోబార్లు రవి, భాజే సాబ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ లో రిప్లేస్మెంట్ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES