Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జెడ్పిటిసి, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను శనివారం కాటారం మండల కేంద్రంలోని వై టీ సీ భవనాన్ని  అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, కాటారం, మహముత్తారం, మలహర్ రావు, పలిమెల మండలాలకు సంబంధించిన ప్రతిపాదిత స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం  స్ట్రాంగ్ రూముల చుట్టుపక్కల  పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అడ్డూరి బాబు, పంచాయతీ కార్యదర్శి షకీర్ ఖాన్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad