నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పలు షాపుల్లో గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత, నవనీత ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఖారా బూందీ తయారీ యూనిట్లు, పలు హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా లైసెన్సులు కలిగి లేని ఆహార వ్యాపార నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. పరిశుభ్రత పాటించని పలు హోటల్లు రెస్టారెంట్ల వ్యాపారులకు కూడా నోటీసులను ఇచ్చారు. ఆహార వ్యాపార నిర్వహకులు, ఇతర వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని సూచించారు. షాపులలో విక్రయించే వస్తువుల పై తప్పనిసరిగా తయారు తేదీ, చివరి తేదీ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తువులను తనిఖీ చేసుకుంటూ గడువు చెల్లిన వస్తువులను పారవేయాలని వ్యాపార నిర్వహకులకు సూచించారు.



