- Advertisement -
శాన్‌ఫ్రాన్సిస్కో : గత వారం ఒరెగాన్‌లో 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన చిప్ మేకర్ ఇంటెల్ మళ్లీ భారీగా ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్దం అవుతోంది. ఈ దఫా ఇంటెల్ ఒరెగాన్ స్టేట్‌లో దాదాపు 2,400 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తోంది. దీంతో ఈ నెలలో మొత్తం ఉద్వాసనల సంఖ్య 2,892కు చేరుకోనుంది. అమెరికా అంతటా రాబోయే రోజుల్లో దాదాపు 4,000 మంది ఇంటెల్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతారని రిపోర్టులు వస్తున్నాయి. ఆ సంస్థ నూతన సీఈఓ లిప్ బు టాన్ ప్రకటించిన కంపెనీ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ ఉద్వాసనలు కొనసాగుతున్నాయి.
- Advertisement -