- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం 1,08,900 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ.. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యోగ కోతలు లేఆఫ్‌లు, సహజ విరమణలు, ఇతర చర్యల ద్వారా జరుగుతాయని కంపెనీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15 శాతం (సుమారు 15,000) ఉద్యోగాలను తగ్గించింది. గత ఏడాది కూడా 15,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించడం గమనార్హం.
- Advertisement -