నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
అంతర్జాతీయ కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పెన్షన్స్ భవన్లో సాంస్కృతిక జేఏసీ ఆధ్వర్యంలో 25 అక్టోబర్ 25న నిర్వహించారు. జేఏసీ నాయకులు రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిరిప లింగన్న మాట్లాడుతూ ప్రజా కళాకారులు ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పి, అభివృద్ధికి దోహదపడాలనీ ఆయన అన్నారు. స్వాతంత్ర పోరాటం నుండి నేటి వరకు వివిధ పోరాటాలకు కళాకారులు చేయూతనిస్తున్నారని ఆయన తెలిపారు.
అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఒకనాడు కళాకారులు రాజుల వినోదానికి కళారూపాలను ప్రదర్శించే వారిని, నేడు ప్రజల సంస్కృతిని, ప్రజల సమస్యలపై కాలాన్ని, గలాన్ని స్వరాన్ని, సాధనంగా మార్చి సామాజిక చైతన్యాన్ని కళాకారులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. శ్రమ సౌందర్యాన్ని వివరించే కళ కారులు, కష్టాలను ఏటికి ఎదురిది జనపక్షపాతులుగా నిలుస్తున్నారని దాసు తెలిపారు. సామాజిక మార్పులో కళాకారులుగా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, జీవిత సార్ధకతను పొందుదామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక జేఏసీ నాయకులు నర్సారెడ్డి, చంద్రశేఖర్, దాల్మల్కి పోశెట్టి, విజయమాల, నరేందర్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.



