Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు

తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు ఆహ్వానం రావడం హర్షించదగ్గ విషయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. ఉపేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం విలేకరు లతో మాట్లాడుతూ.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మ కంగా నవంబర్ 30వ తేదీన అంతర్జాలంలో (ఆన్ లైన్) లొ ప్రతిష్టాత్మకంగా 13 గంటల పాటు “బాల సాహిత్య భేరి” పేరుతో “అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం” నిర్వహిస్తుందని తెలిపారు. ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనటానికి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు రంగరమైన విష్ణువర్ధన్, చిక్కుడు రేఖ, అనిమెల్ల శ్రీనివాస్, అనిమెల్ల జస్వంత్, చిక్కుడు ఓంకార్ ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమంలొ కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని, విద్యార్థులు 101 మంది పాల్గొంటారని అన్నారు. మా విద్యా ర్థులు పద్య విభాగంలో ఎంపికై మూడు నిమిషాల పాటు తాము వ్రాసిన పద్యాలను వినిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలొ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు, జాతీ య, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారని వివరించారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ కు, సమన్వయకర్త చిగు రుమళ్ళ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -