Monday, October 27, 2025
E-PAPER
Homeఖమ్మంఅంతర్రాస్ట్ర బస్ సర్వీస్ ప్రారంభం

అంతర్రాస్ట్ర బస్ సర్వీస్ ప్రారంభం

- Advertisement -

– చదరంగం క్రీడాకారిణి కి అభినందన
– ఉపాధి పనిముట్లు పంపిణీ
– ప్రజా క్షేమమే లక్ష్యం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజా క్షేమమే పరమావధిగా కాంగ్రెస్ పాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. సోమవారం ఆయన మండలంలో పర్యటించారు. తెలంగాణ ఆర్టీసీ సత్తుపల్లి డిఫో నుండి అశ్వారావుపేట మీదుగా ఆంధ్రప్రదేశ్,వెలేదుపాడు వరకు నడిపే ఆర్డినరీ బస్ సర్వీస్ ను ఆయన అశ్వారావుపేట లో సంస్థ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆయన ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణం లో ఉపాధి కూలీలకు గునపం,మట్టి తట్ట పనిముట్లు ను పంపిణీ చేసారు.

కూలీలు తక్కువ కష్టంతో ఎక్కువ పని చేయగలిగేలా ఈ పనిముట్లు ఉపయోగపడతాయని తెలిపారు.కూలీల కష్టానికి విలువ ఇవ్వడం వారికి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.  బస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ప్రజలకు రవాణా సౌకర్యం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులు మరిన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తర్వాత ప్రముఖ ఫొటో గ్రాఫర్  కేశిబోయిన వీరాంజనేయులు – రమాదేవి దంపతుల కుమార్తె చదరంగంలో జాతీయ స్థాయికి ఎంపికైన నేపథ్యంలో విద్యార్థిని భవ్యశ్రీ లక్ష్మీ  ని ప్రత్యేకంగా అభినందించి మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తామని బరోసా ఇచ్చారు.గుమ్మడవల్లి కొత్తూరు ల్లో ఇటీవల ఐటీడీఏ విభాగంలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అదనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత,సహాయ మేనేజర్ విజయ్ శ్రీ,సెక్యూర్టీ హెడ్ కానిస్టేబుల్ రాములు,విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు,స్టేషన్ మేనేజర్ ఆనందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్,రేమళ్ళ కేదార్ నాధ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -