Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు

ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి 
తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఇఇఇ,మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ  నియామకం కొరకు ఈనెల 11వ తేదీన 11 గంటలకు  పరిపాలనా భవనంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 65 శాతం మార్కులతో పాటు రెండు సంవత్సరాల కనీస బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు.

 పీహెచ్డీ/ నెట్ అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందని రిజిస్ట్రార్  ప్రొఫెసర్ డాక్టర్. ఎం యాదగిరి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు  ఒరిజినల్ తో పాటు  రెండు సెట్ల జిరాక్స్  సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad