Monday, March 16, 2026
E-PAPER
Homeబీజినెస్లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడులు

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడులు

- Advertisement -

– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్‌ ఐసోటోప్‌ ల్యాబొరేటరీస్‌ సంస్థ ముందుకొచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. స్థానిక కెమ్‌ తత్వ చిరల్‌ సొల్యూషన్స్‌తో కలిసి అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆదివారం సచివాలయంలో తనతో సమావేశమైన రెండు కంపెనీల సీఈఓలు పెట్టుబడులకు అంగీకరించారని మంత్రి చెప్పారు. జీనోమ్‌ వ్యాలీ ఫేజ్‌-4లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ”లైఫ్‌ సైన్సెస్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ రంగాల్లో తెలంగాణ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతోంది. కేంబ్రిడ్జ్‌ ఐసోటోప్‌ ల్యాబొరేటరీస్‌, కెమ్‌ తత్వల భాగస్వామ్యం అంతర్జాతీయ కంపెనీలకు రాష్ట్రంపై ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా అధునాతన కెమిస్ట్రీ, మెటీరియల్స్‌ రంగాల్లో రాష్ట్ర సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఐసోటోప్‌ లేబుల్డ్‌ కాంపౌండ్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఔషధ పరిశోధనలు, జీవక్రియపై అధ్యయనాలు, రోగనిర్ధారణ పరీక్షలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌, ఆర్గానిక్‌ ఎలక్ట్రో ల్యూమినిసెంట్‌ మెటీరియల్స్‌ సెమీకండక్టర్‌ రంగాల్లో ఇవి విస్తతంగా ఉపయోగపడతాయి” అని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో కెమ్‌ తత్వ చిరల్‌ సొల్యూషన్స్‌ సీఈఓ డాక్టర్‌ విశాల్‌ రాజ్‌పుత్‌, కేంబ్రిడ్జ్‌ ఐసోటోప్‌ ల్యాబొరేటరీస్‌ సీఈఓ క్లిఫ్‌ కాల్డ్‌వెల్‌, తెలంగాణా లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -