– మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపుని చ్చారు. ఈ రంగంలో గడిచిన రెండేం డ్లలో రూ.63వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పరిశ్రమ అనుకూల విధానాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ – గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్క రణలు, సవాళ్లు అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో హైదరాబాద్ దేశానికి రాజధానిగా నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి అందించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే పది టాప్ వాక్సిన్ కంపెనీల్లో 8 కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయన్నారు. ఫార్మా ఉత్పత్తుల తయారీలో దేశంలో మూడింటి రెం డొంతులు ఇక్కడ నుంచే తయా రవుతున్నాయని తెలి పారు. ఈ రంగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణల తీసుకురా వడానికి ఫార్మా కంపెనీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గడి చిన రెండేండ్ల కాలంలో ఈ రంగంలో రూ.63వేల కోట్ల ఉత్పత్తులు తయార య్యాయన్నారు. ఈ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న పలువురు లైఫ్‌సైన్సెస్ ఎదుర్కొం టున్న సమస్యలను ప్రస్తావించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నీరు, మౌలిక వసతులు తదితర సవాళ్లున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీలకు అవసర మయ్యే నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు స్కిల్ యూనివర్సి టీని ఏర్పాటు చేశామ న్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో లైఫ్‌సైన్సెస్ కాకుం డా అన్ని రంగాల మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుం దన్నారు. రాబోయే 2030 నాటికి న్యూఎనర్జీ పాలసీని తీసుకొస్తున్నా మని చెప్పారు. సోలార్, హైడల్, పవర్ బ్యాం కింగ్ విధానాల ద్వారా జీరో పొల్యూషన్ విధా నాలు అమలు చేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో డా. సత్యనారాయణ చావ్లా, డా. మదన్ మోహన్‌రెడ్డి, ప్రియాంక చిగురుపాటి తదితరులు పాల్గొన్నారు.
లైఫ్ సైన్సెస్‌లో రూ.63వేల కోట్ల పెట్టుబడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



