- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి క్లస్టర్ లోని రామారెడ్డి, గిద్ద, ఇస్సన్నపల్లి, రాధాయిపల్లి, గొల్లపల్లి తోపాటు వివిధ గ్రామాల్లో నూతనంగా రెవెన్యూ పాసుబుక్కు పొందిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రామ్ రెడ్డి ఏఈఓ రాకేష్ ఒక ప్రకటనలో శనివారం సూచించారు. రైతు బీమా లో నామిని బదిలీ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకునే రైతులు ఆధార్ కార్డు, పొట్ట పాస్ బుక్ జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ , దరఖాస్తు ఫారంతో సంబంధిత ఏఈఓ కు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.
- Advertisement -