నవతెలంగాణ – నసురుల్లాబాద్ : మధ్యలో బడి మానివేసిన విద్యారులు ఓపెన్ స్కూల్ ద్వార 2025-26 విద్యా సంవత్సరంలో పదవతరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకునే ఆసక్తిగల వారు దరఖాస్తులు చేసుకోవాలని నసురుల్లాబాద్ మండల విద్యాధికారి చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరకాస్తులు చేసుకోవడానికి ఈనెలాఖరువరకు అవకాశంఉందని తెలపారు. పదోతరగతి దరఖాస్తుల కొరకు ఇదివరకు చదివిన పాఠశాలకు సంబంధించిన ఆ విద్యార్థి యొక్క టీసీ, బోనాఫైడ్ లేదా తహసీల్దార్ ద్వారా జారీచేయబడిన బర్త్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కులధ్రువీకరణ పత్రం,రెండు 6 ఫోటోలు రెండు సెట్లుగా జిరాక్స్ లు సమర్పించాలన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు రాయలనుకున్న విద్యార్థులు టెన్త్ మెమో, టీసీ, కులదృవీకరణ పత్రం, అధార్కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు సెట్లుగా సమర్పించాలన్నారు. అదనపు సమాచారం కోసం నసురుల్లాబాద్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు గోపాల్ ను సంప్రదించాలని ఆయన అన్నారు.
టెన్త్.. ఇంటర్ దూరవిద్య ప్రవేశాలకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES