జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని నల్లగొండ జిల్లాలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు “ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్” కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలియజేశారు.
పోలీస్ ఫ్లాగ్ డే/ పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్న వారోత్సవాలలో భాగంగా “అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే” అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2024 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటి వరకు తీసిన 3-ఫోటోలు, తక్కువ నిడివి (3-నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే ఈ పోటీల నామినేషన్లకు పంపించాల్సి వుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ 3-ఫోటోలను పెన్ డ్రైవ్లో సాఫ్ట్ కాపీ ని రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈ నెల 23 వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐటీ కోర్ సెక్షన్ విభాగంలో అందజేయాలని కోరారు.