Wednesday, December 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్లోబల్‌ సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు

గ్లోబల్‌ సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం.. అందజేయనున్న మంత్రులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రైసింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర మంత్రులు స్వయంగా వెళ్లి వారిని ప్రత్యేకంగా కలిసి సదస్సుకు ఆహ్వానిస్తారు. ఈ నెల 4న మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరిగే సమ్మిట్‌ ఆహ్వాన లేఖలు అందిస్తారు. ఎవరెవరు ఏఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం మంగళవారం ఖరారు చేశారు. జమ్మూ కాశ్మీర్‌, గుజరాత్‌కు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పంజాబ్‌ ,హర్యానాకు దామోదర రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణాటక, తమిళనాడుకు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తరప్రదేశ్‌కు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాజస్తాన్‌కు పొన్నం ప్రభాకర్‌ వెళ్లి ఈ ఆహ్వాన లేఖలను అందిస్తారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్‌కు సీతక్క, మధ్యప్రదేశ్‌కు తుమ్మల నాగేశ్వరరావు, అసోంకు జూపల్లి కృష్ణారావు, బీహార్‌కు వివేక్‌ వెంకటస్వామి, ఒడిశాకు వాకిటి శ్రీహరి, హిమాచల్‌ప్రదేశ్‌కు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మహారాష్ట్రకు మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఆహ్వాన లేఖలను అందిస్తారు. కాగా ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఆహ్వానం అందించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -