కౌమార స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించండి
అవగాహనా సదస్సులు నిర్వహించండి
అధికారులను ఆదేశించిన సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్హులైన మహిళలను వెంటనే మహిళా సంఘాల్లో చేరేలా అవగాహన కల్పించాలని అధికారులను సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని ఆదేశించారు. కౌమార స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె 32 జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సెర్ప్ ఏపీడీలు, డీపీఎంలు, ఏపీఎంలతో జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులు, వికలాంగుల, కిషోర బాలిక సంఘాలను నూతనంగా ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కోటిమందిని ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో చేర్చేలా చూడాలన్నారు. అందులో భాగంగా ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు గ్రూపుల్లో చేరేలా మహిళలకు అవగాహన కల్పించడం, జిల్లా, మండల స్థాయిలో వారితో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంఘంలో చేరితే జరిగే ప్రయోజనాలను విడమర్చి చెప్పాలని సూచించారు. కొత్త ఎస్‌హెచ్‌జీల డేటాను సెర్ప్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కలెక్టర్లు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి రోజువారీగా పురోగతిని నివేదించాలని అభ్యర్థించారు.
అర్హులను మహిళా సంఘాల్లో చేర్పించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES