దుబాయి : యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ మూడు విడతలుగా క్షిపణులను ప్రయోగించిందని, వాటిని అడ్డుకున్నామని యూఏఈ చెప్పింది. టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ, దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించింది. తాజాగా ఇరాన్ డ్రోన్లు దుబాయి సమీపంలో ఆస్ట్రేలియా ఉపయోగించుకుంటున్న ఓ వైమానిక స్థావరంపై దాడి చేశాయి. అల్ మిన్హాద్ వైమానిక స్థావరంపై జరిగిన ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, దీనిని మధ్యప్రాచ్యంలో సైనిక కార్యకలాపాల కోసం ఆస్ట్రేలియా చాలా కాలంగా ఉపయోగించుకుంటోందని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది.
తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు, ఆరు క్రూయిజ్ క్షిపణులు, 148 డ్రోన్లతో ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు జరిపిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత 174 బాలిస్టిక్ క్షిపణులు, 689 డ్రోన్లను గుర్తించామని చెప్పింది. వీటిలో చాలా వాటిని అడ్డుకొని ధ్వంసం చేశామని వివరించింది. కొన్ని మాత్రం పరిమిత నష్టాన్ని కలిగించాయని అంటూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 68 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. ఇరాన్ దాడులను గగనతల రక్షణ వ్యవస్థలు, ఫైటర్ జెట్లు అడ్డుకుంటుండడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వినిపిస్తున్నాయి.
దుబాయిలో ఆస్ట్రేలియా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



