Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌ను కోల్పోయిన ఇరాన్

మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌ను కోల్పోయిన ఇరాన్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌ను కోల్పోయింది.ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్‌ (Iran)కు చెందిన సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ నిఘా డిప్యూటీ జనరల్‌ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్‌ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి

ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ గురువారం అర్ధరాత్రి భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్‌ మహమ్మద్‌ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్‌ అమీర్‌అలీ హాజీజదే మృతిచెందిన సంగతి తెలిసిందే. పలువురు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. దీనికి ప్రతిగా ఇరాన్‌ కూడా ఎదురుదాడులకు దిగింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. శనివారం కూడా టెహ్రాన్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతుండగా.. టెల్‌అవీవ్‌ లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైళ్లను ప్రయోగించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad