Saturday, March 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబాగ్దాద్‌లో అమెరికా ఎంబసీపై ఇరాన్‌ క్షిపణి దాడి

బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీపై ఇరాన్‌ క్షిపణి దాడి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్:

ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌ వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దాడులు చేసింది. టెహ్రాన్‌ ప్రతిదాడులకు దిగింది. తాజాగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అగ్రరాజ్య ఎంబసీపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో హెలిప్యాడ్‌ ధ్వంసమైనట్టు ఇరాక్‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

క్షిపణి దాడితో ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ పదేపదే రాకెట్‌లు, డ్రోన్‌లతో దాడులు చేస్తోంది. తాజా ఘటన కూడా టెహ్రాన్‌ పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అగ్రరాజ్య రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు దుబాయ్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి దాడి జరగడం పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిన్నదని దుబాయి మీడియా ఆఫీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. శుక్రవారం కూడా ఈ నగరంలోని ఓ భవనంపై డ్రోన్‌ దాడి జరిగినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -