Sunday, December 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచమురు ట్యాంకర్‌ను సీజ్‌ చేసిన ఇరాన్‌

చమురు ట్యాంకర్‌ను సీజ్‌ చేసిన ఇరాన్‌

- Advertisement -

అందులో భారతీయులతో సహా 18 మంది సిబ్బంది
టెహ్రాన్‌ : భారీ పరిమాణంలో చమురును మోసుకెళ్తున్న ఒక నౌకను ఇరాన్‌ సీజ్‌ చేసింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. అందులో భారతీయులతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 60 లక్షల లీటర్ల చమురును అక్రమంగా తరలిస్తున్నారనీ, అందుకే నౌకలోని నావిగేషన్‌ వ్యవస్థలన్నింటినీ నిలిపివేశారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. గల్ఫ్‌లో అక్రమంగా ఇంధనం రవాణా చేస్తోన్న నౌకలను అడ్డుకుంటున్నట్టు ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. చమురు ఎగుమతి చేస్తోన్న దేశాల్లో ఒకటైన ఇరాన్‌లో చమురు ధరలు అతి తక్కువగా ఉంటాయి.

అందుకే ఇక్కడినుంచి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి, కొందరు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ కార్యకలాపాలను ఇరాన్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. కాగా వెనిజులా తీరంలో రెండ్రోజుల క్రితం అమెరికా ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ను సీజ్‌ చేసింది. నౌక కెప్టెన్‌ వెనిజులా, ఇరాన్‌ల నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నాడన్న ఆరోపణలతో ఈ నౌకను అమెరికా అడ్డుకుంది. వెనిజులా తీరం నుంచి క్యూబాకు బయలుదేరిన ఈ భారీ నౌకను అమెరికా సైనికులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలికాప్టర్‌లో వెళ్లి షిప్‌పై దిగారు. ఆయుధాలతో షిప్‌ సిబ్బందిని చుట్టుముట్టిన వీడియోను అమెరికా మీడియాకు విడుదల చేసిం ది. అది జరిగిన రెండ్రోజులకే ఇరాన్‌ ఈ నౌకను సీజ్‌ చేయటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -