Wednesday, March 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై దాడి..101 మంది గల్లంతు

శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై దాడి..101 మంది గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇజ్రాయెల్- అమెరికా కుటమి ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ శ్రీలంక దక్షిణ తీరంలో పెను ప్రకంపనలు సృష్టించే ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై సబ్‌మెరైన్ ద్వారా దాడి జరగడంతో ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 101 మంది సిబ్బంది గల్లంతైనట్లు శ్రీలంక నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. శ్రీలంకలోని గాలె నగర సమీపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో బుధవారం ఈ దాడి జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ నౌక నుంచి ఆపదలో ఉన్నట్లు సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ వెంటనే రంగంలోకి దిగింది. నౌక వేగంగా మునిగిపోతున్న తరుణంలో సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ఇప్పటి వరకు 30 మందిని సురక్షితంగా రక్షించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -