- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలోని యావపూర్ పరిధిలో గల ఐరిస్ పాఠశాల విద్యార్థులు నాందేడ్‌లో జరిగిన 5వ రోలర్ బాస్కెట్ బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ లో 2వ స్థానంలో నిలిచి సత్తా చాటారు. విద్యార్థులకు 10 రజత పతకాలు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రుద్ర లక్ష్మీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని,తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించాలని తెలిపారు.
- Advertisement -



