Thursday, November 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజా వేదికలో బయటపడ్డ అవకతవకలు 

ప్రజా వేదికలో బయటపడ్డ అవకతవకలు 

- Advertisement -

ముధోల్ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్..
నవతెలంగాణ – ముధోల్ 

నియోజకవర్గ కేంద్రంమైన ముధోల్ లో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన 15 విడత ప్రజా వేదిక కార్యక్రమంలో పలుఅక్రమాలు బయటపడ్డాయి. మండల పరిధిలోమొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను ఉపాధి హామీ పధకం ద్వారా 290 పనులకు గాను రూ.4,79,62,997లు అలాగే పంచాయతీ రాజ్ ద్వారా 100 పనులకు గాను రూ.3,97,59,675 రూపాయల పై సామాజిక బృందం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.ఇందులో పంచాయతీ రాజ్ కు సంబంధించిన 91శాతం రికార్డులు సామాజిక బృందానికి అందుబాటులో లేకపోవడంతో 9శాతం మాత్రం పనులను తనిఖీ చేశారు.ఉపాధి హామీ పథకం కు సంబంధించిన 100శాతం నిర్వహించిన సర్వేకు సంబంధించి ప్రజావేధికలో జరిగిన అవకతవకల ను వెల్లడించారు .

  గ్రామాలలో ఉపాధిహామి పనికి వెళ్లకున్న వెళ్లినట్టు హాజరు వేసి డబ్బులు లేపడం, పనికు వెళ్లకున్న సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోవడంలాంటి ఘటనలను తనిఖి బృందం గుర్తించింది. ఎంబి లో  నమోదు లేకుండా డబ్బులు లేపడంతో పాటు  మస్టర్లను దిద్దుబాటు చేయడం, ఒక దగ్గర చేయాల్సిన పని మరొక దగ్గర చేయడం ఒక్క కుటుంబం పైనే రెండు జాబ్ కార్డులు ఏర్పాటు చేసి డబ్బులు లేపడం  వంటి అక్రమాలు  బయట పడ్డాయి.మేట్లు కూలివద్ద వారానికి రూ. 100 చొప్పున తీసుకోవడం జరిగిందని తనిఖీ బృందం సభ్యులు పేర్కొన్నారు. ప్రధానంగా ముధోల్ పంచాయతీ లో ఎక్కువ అక్రమాలు జరగడంతో ఫీల్డ్ అసిస్టెంట్ ను  సస్పెన్షన్ చేస్తున్నట్లు డిఆర్డిఓ విజయ లక్ష్మి తెలిపారు.అంతే కాకుండా మండలంలో ని 19 గ్రామపంచాయతిలకు కలిపి  ఫీల్డ్ అసిస్టెంట్ లకి ,సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శి లకు రూ.73194 రికవరీ, రూ.14000పెనాల్టీ విధించారు.కేవలం ముధోల్ గ్రామ పంచాయతీ సంబంధించి.రూ.62741 రికవరీ,రూ.7000పెనాల్టీ వేశారు.అంటే ముధోల్ జిపి పరిధిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని డిఆర్డిఓ ఉపాధిహామి సిబ్బందిపై మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో పీఎం అశోక్,ఎస్టీఎం దత్తు, హెచ్,ఆర్ మేనేజర్ సుధాకర్ ,ఎంపీడీవో లవకుమార్ ,ఏపీఓ శిరీష రెడ్డి, ఎంపీ ఓ శివకుమార్ ,ఎస్ఆర్పి మహేష్, డిఆర్పిలు, టి ఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు, గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -