– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
– రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రేపటి నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఆయకట్టు పరిధిలో సాగు కోసం లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్ కు నీటి విడుదల జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం బాల్కొండ నియోజకవర్గ రైతుల అవసరాల దృష్ట్యా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి లక్ష్మీ కాలువకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడారు.తక్షణం నియోజకవర్గ రైతులకు నీటి విడుదల అవసరాన్ని మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదలను చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన ముత్యాల సునీల్ కుమార్ ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైన దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టుల నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు కలుస్తున్నా, ప్రస్తుతానికి ప్రాజెక్టు నీటిమట్టంలో అంత పెద్ద మార్పు ఏమి కనిపించడం లేదన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో భారీ వర్షాలు కురవడం ద్వారానే ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, దేవుడి దయవల్ల భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు నీటి విడుదలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
రేపటి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES