Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇష్ట సహిత బ్రహ్మోత్సవాలు ప్రారంభం 

ఇష్ట సహిత బ్రహ్మోత్సవాలు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – దిల్ సుఖ్ నగర్ : అష్టలక్ష్మీ దేవాలయ ఇష్ట సహిత బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయిని ఆలయ కమిటీ చైర్మన్ సోమ సురేష్, ఫౌండర్ చైర్మన్ గౌరి శెట్టి చంద్రశేఖర్ గుప్తలు తెలిపారు. మొదటి రోజు స్వామి వారి పల్లకీ సేవ, ఉత్సవారంభ స్నపనం మంగళ శాసన కార్యక్రమాలు జరిగాయని వారు వివరించారు. అదే విధంగా సహస్ర నామ స్తోత్ర పారాయణ, విష్వక్సేనారధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం నిర్వహించామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గంప జగన్, కోశాధికారి అంజయ్య సభ్యులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ చిలుక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -