నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై కాల్పుల విరమణకు చర్చలు జరిపి… కొన్నిరోజులు ఆ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అమలు చేసింది. ఈ విధమైన చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ చెప్పినట్టు గాజాపై కాల్పుల విరమణ ఇజ్రాయిల్ కొన్నిరోజులు అమలు చేసినప్పటికీ మరలా దాని కపటబుద్ధి బయటపెట్టింది. ఇజ్రాయిల్ గత కొన్నిరోజులుగా గాజాపై దాడులు కొనసాగిస్తోంది. దీంతో వందలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. పైగా భవిష్యత్తులో కూడా గాజాపై దాడుల్ని కొనసాగించడానికి 34 బిలియన్ డాలర్ల సైనిక బడ్జెట్‌ను కేటాయించినట్లు తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. గత బడ్జెట్‌లో 27 బిలియన్ డాలర్లు కేటాయిస్తే.. వచ్చే ఏడాది ఈ బడ్జెట్‌ను ఇజ్రాయిల్ 34 బిలియన్ డాలర్లకు పెంచడం గమనార్హం.
కాగా, అక్టోబర్ 10న కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినప్పటికీ గాజాలోని దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్ యొక్క తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది.
గాజాపై దాడికి ఇజ్రాయిల్ భారీగా బడ్జెట్ కేటాయింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



