నవతెలంగాణ-హైదరాబాద్: గాజావ్యాప్తంగా ఇజ్రాయిల్ దాడులకు 74 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. సోమవారం జరిగిన ఈ దాడుల్లో 36 మంది మానవతా సహాయం కోరుతున్నవారేనని వైద్యవర్గాలు తెలిపాయి. గాజాలోని పౌరులకు కనీస అవసరాలు తీర్చడానికి 600 ట్రక్కులు అవసరం. కానీ ఇజ్రాయిల్ మాత్రం కేవలం 86 ట్రక్కులను మాత్రమే గాజాలోకి అనుమతిస్తుంది. అంటే సుమారు 14 శాతం మాత్రమేనని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం డేటా తెలిపింది.
కాగా, ఇజ్రాయిల్ మానవత్వానికి వ్యతిరేకంగా మారణహోమం చేస్తుంది. ఈ మారణహోమాన్ని ఆపాలని అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సీనియర్ హమాస్ అధికారి ఒసామా హమ్దాన్ అన్నారు. అక్టోబర్ 7. 2023లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల వల్ల 60,933 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 150,027 మందికి గాయాలయ్యాయి.