నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో చేపట్టబోయే చంద్రయాన్-4 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 2027లో ఉండనుంది. మరో 7 ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసిందని ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.చంద్రయాన్-4 ప్రయోగం ద్వారా ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిన ధ్రువంలోని వాటర్ ఐస్‌ను అధ్యయనం చేయనున్నారు. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రలో ఒకటిగా నిలువబోతోంది. దీంతో పాటు JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ LUPEX ద్వారా చంద్రుడి ధ్రువాల అన్వేషణ కార్యక్రమం కూడా ఉండబోతోంది.
చంద్రయాన్ -4 చంద్రుడి ననుంచి నమూనాలనున భూమికి తీసుకురావడాన్ని లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనాలు మాత్రమే ఇలాంటి విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించాయి. అంతరిక్షంలో సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో భావిస్తోంది. దీనికి పని ప్రారంభించినట్లు నారాయణన్ చెప్పారు. ఐదు మాడ్యుళ్లతో ఈ కేంద్రాన్ని 2028లో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. దీనిని 2035 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాసా ఐఎస్ఎస్, చైనీస్ అంతరిక్ష సంస్థకు తియాంగాంగ్ వంటి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.



