Sunday, December 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అడవుల విస్తీర్ణం తెలుసుకునేలా.. ఇస్రో సరికొత్త పరిజ్ఞానం

అడవుల విస్తీర్ణం తెలుసుకునేలా.. ఇస్రో సరికొత్త పరిజ్ఞానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
అడవులపై సాంకేతిక సహాయంతో అటవీశాఖ నిఘా పెట్టనుంది. వాటి సంరక్షణకు సరికొత్త పరిజ్ఞానాన్ని ఇస్రో అందించనుంది. ఇస్రో ఏజెన్సీ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా అటవీ సంపదపై పర్యవేక్ష ణ చేయనుంది. అడవుల తగ్గుదల, పెరుగుదల, పోడు కోసం పోయిన అటవీ భూమి, అగ్నిప్రమా దాలు తదితర అంశాలను ఎస్ఆర్ఎసీసీతో పరిశీలించే అవకాశం ఉంది. అడవులను కాపాడేం దుకు అటవీశాఖ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అడవుల శాతం తగ్గితే వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అడవులు సమృద్ధిగా పెరిగితే జీవ కోటికి ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో అధికారులు అటవీ విస్తీర్ణానికి సంబంధించిన రిపో ర్టులు తయారు చేయడానికి 9 నెలల పైగా కాలం పట్టేది, నూతన ఎస్ఆర్ఎస్సీ విధానం ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కేవలం ఐదు రోజుల్లోనే నివేదిక వచ్చేలా చర్యలు చేపట్టను న్నారు. రాష్ట్రంలోని అన్ని అటవీప్రాంతాలు, కవ్వాల్ టైగర్ జోన్లోని అడవుల విస్తీర్ణం తెలుసుకు నేందుకు ఈ విధానం అమలు చేయనున్నారు.

ఎన్ఆర్ఎస్సీ అంటే..
ఆక్రమణ నుంచి అడవులను రక్షించుకేందుకు అటవీశాఖ ఎస్ఆర్ఎస్సీ రూపొందించింది. హెక్టార్ విస్తీర్ణంలో గల అడవుల మార్పును ఈ విధానంతో కనిపెట్టే అవకాశం ఉంది. అప్టికల్ రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫార్మేషన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్తో కలిసి ఈ విధానం పనిచేస్తుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగించి, ఫలితాల అనంతరం అన్ని ప్రాం తాల్లో ఈ విధానం ద్వారా అంచనా వేసే అవకాశా లున్నాయి.

ఉపయోగాలు ఇలా..
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఉపయోగించి కాలక్రమే ణా అటవీ విస్తీర్ణం, పరిమాణాన్ని మ్యాప్ చేయడం అడవిని పర్యవేక్షించడం జరుగుతుంది. వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల గురించి వెంటనే సం బంధిత ప్రాంత అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాలిపోయిన ప్రాం తాలను ట్రాక్ చేయడానికి అటవీ శాఖలకు హెచ్చ రిక అందించడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగిస్తుంది. వన్యప్రాణుల ఆవాసాలు, కారిడార్లను పర్యవేక్షించడానికి రిమోట్ సెన్సింగ్ ఉపయో గిస్తారు..

అడవి విస్తీర్ణం తెలుసుకోవచ్చు:  జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా అడవి విస్తీర్ణం తేలికగా గుర్తించవచ్చు. అక్షాంశాలు, రేఖం శాల ద్వారా ఫొటోలు అందిస్తుంది. ఇప్పటికే శాటి లైట్ ద్వారా అగ్ని ప్రమాదాల గుర్తించడం, సమాచారం చేరవేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా అడవుల గురించి తెలుసు కోవడం సులభమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -