Thursday, December 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరేర్‌ ఎర్త్‌ లైసెన్సులు జారీ

రేర్‌ ఎర్త్‌ లైసెన్సులు జారీ

- Advertisement -

ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య కుదిరిన ఒప్పందం
మూడు కంపెనీలకు అనుమతులు


బీజింగ్‌ : అమెరికా, చైనా అధ్యక్షులు ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బీజింగ్‌ తొలి విడతగా రేర్‌ ఎర్త్‌ ఎగుమతి లైసెన్సులు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై చైనా ఏప్రిల్‌లో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా మరిన్ని ఎగుమతులను అనుమతిస్తోంది. అందుకోసం కొత్తగా సాధారణ లైసెన్సులు జారీ చేస్తోంది. చైనాకు చెందిన మూడు ప్రముఖ కంపెనీలు తమ క్లయింట్ల కోసం సాధారణ లైసెన్సులు పొందాయి. ఈ కంపెనీలన్నీ ఆటోమోటివ్‌ పరిశ్రమకు రేర్‌ ఎర్త్‌ అమ్మకాలు జరుపుతాయి. జేఎల్‌ మాగ్‌ కంపెనీకి యూరప్‌లోనూ, నింగ్బో యున్షెంగ్‌ కంపెనీకి యూరప్‌, అమెరికాలో క్లయింట్లు ఉన్నారు. ప్రస్తుతానికి చైనాకు చెందిన భారీ రేర్‌ ఎర్త్‌ కంపెనీలకు మాత్రమే సాధారణ లైసెన్సులు జారీ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -