Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ముస్లిం యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..

ముస్లిం యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..

- Advertisement -

– 103 యూనిట్ల రక్తం సేకరణ..
– మిలాద్ ఉన్ నబి సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం..
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో మిలాద్ ఉన్ నబి  కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిలాద్ కమిటీ నిర్వాహకులు అన్వర్, ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ.. మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గడిచిన ఐదు సంవత్సరాల నుండి 650 యూనిట్ల రక్తాన్ని సేకరించి ముస్లిం యువత మహమ్మద్ ప్రవక్త బోధించిన సేవా న్యాయం ధర్మం సామాజిక బాధ్యత విషయాలను అనుసరిస్తున్నారు అనడానికి ఈ రక్తదాన శిబిరాలే నిదర్శనం అని అన్నారు.

తోటి వారికి సహాయం చేయాలన్న ఆశయంతో రక్తదానానికి ముందుకు వస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాతలందరినీ అభినందించడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు ఖదీర్ సమీర్, మిలాద్ ఉన్ నబి  కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాతలకు కామారెడ్డి పట్టణ సిఐ నరహరి, ట్రాఫిక్ ఎస్సై మహేష్,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్,ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్,ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad