Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అభినందనీయం..

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అభినందనీయం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. ఆదివారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ మంత్రి   వడ్లూరి లక్ష్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ  వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించడం జరిగిందన్నారు.

అనంతరం మంత్రిని  కలిసి శాలువాతో సన్మానించారు.ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న  సి ఆర్ టి   ఉపాధ్యాయుల వేతనాలు ఇవ్వాలని కోరగా సోమవారం నుండి వాళ్లకు వేతనాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో నష్టపోయిన రహదారులకు నిధుల మంజూరు,జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని మంత్రికి సుగుణక్క విన్నవించారు. మారుమూల గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసి గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని సుగుణక్క కోరారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జీవో నెంబర్ 240  ద్వారా గిరిజనుల శ్రేయస్సు కొరకై రూ. 465.55 కోట్ల నిధులను గిరిజనులు ఎక్కువగా వుండే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 73 కోట్ల నిధులను అభివృద్ధి కొరకు కేటాయించడం సంతోషంగా ఉందని,ఆదిలాబాద్ ప్రజలు ఏనాడూ కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని మరువలేరని సుగుణక్క తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి  అడ్లురీ లక్ష్మణ్ కుమార్ తో పాటు మత్రులందరికీ ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజల తరఫున సుగుణక్క కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad