కాంగ్రెస్ నాయకుల ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామ సర్పంచ్ గా అజ్మీరా సారక్క చాటున కొడుకు అజ్మీరా బాలాజీ నాయక్ పెత్తనం చేయడం సరికాదని గ్రామ మాజీ సర్పంచ్ బానోతు రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు అజ్మీరా రాజునాయక్ ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అజ్మీరా బాలాజీ నాయక్ అన్ని తానై అధికార దుర్వినియోగానికి పాల్పడం జరుగుతుందన్నారు. ఇందుకు నిదర్శమే గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ లేకుండానే పిల్డ్ అసిస్టెంట్ తో కలిసి జాలజీ నాయక్ ప్రభుత్వం సబ్సిడీపై అందించిన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేయడమన్నారు. ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో తల్లి సర్పంచ్ అధికార కార్యక్రమాల్లో హాజరు కాకుండా కొడుకు హాజరవుతూ పంచాయితీ రాజ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తల్లి సర్పంచ్ చాటున కొడుకు పెత్తనం సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



