Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీదేవసేనపై విమర్శలు చేయడం సరికాదు

శ్రీదేవసేనపై విమర్శలు చేయడం సరికాదు

- Advertisement -

తెలంగాణ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి శ్రీదేవసేనపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్‌ చేసిన తీర్మానాన్ని అధ్యక్షులు కె.రామకృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఆ అధికారిణిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని తక్కువ చేస్తూ అణగదొక్కేలా చేసిన వ్యాఖ్యలు సివిల్‌ సర్వీసెస్‌ గౌరవాన్ని కించపరిచేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవనీ, ఆమోదనీయం కానివనీ, హానీ కలిగించే వని అభిప్రాయపడ్డారు. ప్రతి స్థాయిలో సివిల్‌ సర్వెంట్స్‌ అంకితభావం, నిష్పక్షపాతం, చిత్త శుద్ధి, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత త్యాగాలతో తమ విధులను నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి వారిపై వాస్తవం లేకుండా దురుద్దేశం ఆపాదించేలా చేసే నైతికస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే అసమంజస మైన, ఆధారం లేని ఆ ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -