Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను రాజులను చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

రైతులను రాజులను చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

- Advertisement -

– రాయపర్తి మండలంలో కోటి రూపాయలతో ఇరిగేషన్ పనులు
– నియోజకవర్గంలో దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు
– రైతుల కోసం కొంత మంది రోడ్లెకి బిల్డప్ లు ఇస్తున్నారు…
– పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశాశ్విని రెడ్డి
– రూ. 8 లక్షల వ్యయంతో డిబిఎం 55 కెనాల్ పూడికతీత పనులు ప్రారంభం
నవతెలంగాణ – రాయపర్తి
రైతులను రాజులను చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశాశ్విని రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాయపల్లి గ్రామ సమీపం గుండా వెళ్లే మెన్ ఎస్సారెస్పీ కెనాల్ కాలువ ఫీడర్ ఛానల్ డిబిఎం 55 పూడికతీత, జంగల్ కట్టింగ్ పనులను ప్రారంభించారు. ఉడిక తిత పనులు ప్రారంభించే స్థలానికి విచ్చేసిన ఎమ్మెల్యే రైతులు, అధికారులతో ట్రాక్టర్ పై వెళ్లి పని ప్రారంభించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ… ఆపరేషన్/ మెయింటెనెన్స్ నిధుల నుండి 8 లక్షల రూపాయల వ్యయంతో ఈ పని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు పుష్కలమైన సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దాని ప్రకారం దశలవారీగా పనులు చేపడుతున్నామని వివరించారు.

తదుపరి తిర్మలాయపల్లి పరిధిలోని 500 ఎకరాలకు సాగునీరును నిరంతరం అందిస్తాం అని హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా కెనాల్ కాలువల మరమ్మతు పనులను చేపట్టకపోవడంతో  కాలువల్లో గడ్డి, చెట్లు పేరుకుపోయి నీటి ప్రవాహం తగ్గుతుందని దాంతో చెరువుల్లోకి నీరు చేరాలంటే సమయం పడుతుందని ఈ సమస్యను పరిష్కరించడానికి కెనాల్ కాలువల ఫీడర్ ఛానల్ లను సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతులకు ఎరువులను అందించడం జరిగిందని చెప్పారు. కొంతమంది రైతులకు మేలు చేస్తున్నామని రోడ్లెక్కి బిల్డప్పులు చేస్తున్నారని దుయ్యబడ్డారు.

వారి మాయ మాటలను, బురిడీ వేషాలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ డిఈ కిరణ్ కుమార్, ఏఈ బాలదాసు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఈఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పాలకుర్తి ఆలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఆకుల సురేందర్ రావు, ఎండి అప్రోస్ ఖాన్, ఎండి నాయిమ్, గజవెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -