– వచ్చే ఐదురోజులు వానలు
– అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. రాత్రి పది గంటల వరకు 872 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కుంటాలలో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా అన్ని చోట్ల మోస్తరు, తేలికపాటి వర్షం పడింది. రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగడం, రాష్ట్రం మీదుగా ఉపరిత ఆవర్తనం నెలకొనటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం మూలాన రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వానలు పడే అకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలను పేర్కొన్నారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, నగరంలో చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం, పలు చోట్ల చిరుజల్లులు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES