Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం నవ్విస్తుంది

ఆద్యంతం నవ్విస్తుంది

- Advertisement -

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్‌ వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మిస్తున్నారు. దర్శకుడు మురళీ మనోహర్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో ప్రొడ్యూసర్‌ జయకాంత్‌ (బాబీ) మాట్లాడుతూ, ‘డైరెక్టర్‌ మురళీ మనోహర్‌ మా ఫ్రెండ్‌. ఆయన ఈ స్టోరీ మాకు నెరేట్‌ చేశాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసేందుకు ఇలాంటి కొత్త తరహా కథ కరెక్ట్‌ అనుకుని మూవీ స్టార్ట్‌ చేశాం. కొత్త ప్రొడ్యూసర్స్‌ అంటే ఏదైనా లవ్‌ స్టోరీతో, యూత్‌ ఫుల్‌ కంటెంట్‌తో చేస్తుంటారు.

కానీ రొటీన్‌ ప్రాజెక్ట్‌ చేయొద్దనే డార్క్‌ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను నిర్మించాం. నరేష్‌ ఆగస్త్య ‘గుర్రం పాపిరెడ్డి’ టైటిల్‌ క్యారెక్టర్‌లో బాగా నటించాడు. ఫరియా అబ్దుల్లాకు మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. అలాగే ఇందులో ఆమె ఒక సాంగ్‌ రాసి, పాడి కొరియోగ్రఫీ చేసింది. ఆ పాట వైరల్‌గా మారుతోంది. బ్రహ్మానందం, యోగి బాబు కీ రోల్స్‌ చేశారు’ అని తెలిపారు. ‘తెలివిలేని వాళ్లు తెలివైన వాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మా మూవీ పాయింట్‌. ఫన్‌, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సందేశాలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. వాళ్లను ఆ కాసేపు ఎంటర్‌ టైన్‌ చేయాలి. మా మూవీ కంటెంట్‌ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. మ్యాడ్‌, మ్యాడ్‌ 2 చూస్తున్నప్పుడు ఆ పాత్రలను చూస్తేనే ఎలా నవ్వుకున్నామో మా సినిమా లోనూ ఆర్టిస్టులను చూడగానే ఫన్‌గా ఫీలవుతారు. ‘అవతార్‌’ సినిమాతో పాటే మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’ అని ప్రొడ్యూసర్‌ అమర్‌ బురా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -