Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం నవ్విస్తుంది

ఆద్యంతం నవ్విస్తుంది

- Advertisement -

శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్‌లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాత అనిల్‌ సుంకర మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.

-సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. అయితే మా సినిమా కూడా ఈ పండక్కి తగ్గట్టుగానే ఉంటుంది. అన్ని సినిమాలకు సంక్రాంతి సీజన్‌ వర్కవుట్‌ అవుతుంది. అంతేకాదు ఈ సీజన్‌లో రిలీజైన సినిమాలన్ని హిట్‌ అయిన సందర్భాలూ ఉన్నాయి.
-ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిది. థియేటర్‌లో కూర్చున్నంత సేపూ ప్రేక్షకుల్ని నవ్విస్తాం. బాలయ్య నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ని ఆయనతోనే ఓపెన్‌ చేయించాం. ఈ సినిమాని నైజాం, వైజాగ్‌లో దిల్‌రాజు రిలీజ్‌ చేస్తున్నారు. ఈస్ట్‌లో సొంతంగా చేస్తున్నాం. వెస్ట్‌, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్‌లో శోభన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అయితే ఎన్ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నామనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్మాత కూడా చెప్పలేడు (నవ్వుతూ).

-ఈ సినిమాలో శర్వానంద్‌ అద్భుతంగా నటించారు. అలాగే ఇందులో శ్రీవిష్ణు పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈపాత్ర వచ్చినప్పుడు అందరూ బాగాఎంజాయ్ చేస్తారు. ఈ క్యారెక్టర్‌ ఆద్యంతం నవ్విస్తుంది. అలాగే శర్వా, శ్రీవిష్ణు కాంబోలోని సీన్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. ఓ పెద్ద హీరో వచ్చి హడావుడి చేసినట్టుగా కాకుండా మనలోంచి ఓ సాధారణ మనిషి వచ్చి ఎంటర్‌టైన్‌ చేసినట్టుగా ఉంటుంది.
-మేం ఎక్కువగా మహేష్‌బాబుతో సినిమాలు చేశాం. ప్రస్తుతం చిన్న, పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాం. సాయిధరమ్‌ తేజ్‌తోనూ ఓ ప్రాజెక్ట్‌ గురించి చర్చిస్తున్నాం. అయితే ఇకపై ప్రయోగాలు కాకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఎయిర్‌ఫోర్స్‌ బెజవాడ బ్యాచ్‌’ అనే ఓ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వీటితోపాటు తేజ సజ్జాతో ఓ సినిమా ఉంటుంది. అలాగే అడివిశేష్‌తో ‘గుఢచారి 2’ రాబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -