మోడీ సర్కార్ విధాన నిర్ణయాలతో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా కాంట్రాక్టు నియామకాలు
తగ్గుతున్న శాశ్వత ఉద్యోగాలు..ఏటా 30వేల మంది కుదింపు
ఏటా డిగ్రీలు పట్టుకుని రోడ్లపైకి వస్తున్న నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదువుకు తగ్గట్టుగా నైపుణ్యం ఉన్నా, సర్కారు నౌకరీ దక్కటంలేదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరం గంలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉంటున్నాయి. పార్లమెంట్ సాక్షిగా లక్షలాది ఉద్యోగాలు భర్తీ కాకుండా, ఖాళీగానే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ ఖాళీల్లో పరిమితంగా తక్కువ వేతనాలు ఇస్తూ కాంట్రాక్టు ఉద్యోగులతో నింపేస్తోంది. ఈ తీరుపై నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీల నియామకాల్లో కాంట్రాక్టు విధానాన్ని మోడీ సర్కార్ భారీగా ప్రోత్సహిస్తోంది. శాశ్వత ఉద్యోగ నియామకాలకు కోత పెడుతూ భద్రత లేని కాంట్రాక్టు వ్యవస్థను పెంచుతోంది. దినసరి వేతన కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన రిపోర్ట్ ప్రకారం గడిచిన ఐదేండ్లలో ఒక్క ఏడాదిలో మినహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో రెగ్యులర్ నియామకాలు భారీగా తగ్గాయి. ఇదే సమయంలో క్యాజువల్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్క కరోనా ఏడాదిలో మాత్రం కాంట్రాక్టు నియమకాలు తక్కువగా నమోదయ్యాయి. 2025 మార్చి 31 నాటికి మొత్తం 475 సీపీఎస్‌ఈలు ఉండగా, అందులో ప్రస్తుతం 291 సంస్థలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి.
పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే ప్రకారం 2024-25 అన్ని రంగాల్లోని సీపీఎస్‌ఈలు కలిపి మొత్తం 15.42 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. 2023-24లో ఈ సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. దీంతో పోల్చితే నియామకాల్లో కేవలం 1.61 శాతం పెరుగుదల మాత్రమే చోటు చేసుకుంది. ఈ స్వల్ప పెరుగుదలకు కూడా 54 వేల మందికి పైగా దినసరి కూలీలు, కాంట్రాక్ట్ కార్మికులను అధికంగా తీసుకోవడమే కారణం. ఇదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 30 వేలు తగ్గడం ఆందోళకరం. ఆర్థిక సంవత్సరం 2022-23 మినహా గత ఐదేండ్లుగా ఇదే ఒరవడి కొనసాగింది. వేతన ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా భారీగా తగ్గాయి. ఇదే సమయంలో క్యాజువల్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్క కరోనా ఏడాదిలో మాత్రం కాంట్రాక్టు నియమకాలు తక్కువగా నమోదయ్యాయి.
2025 మార్చి 31 నాటికి మొత్తం 475 సీపీఎస్‌ఈలు ఉండగా, అందులో ప్రస్తుతం 291 సంస్థలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే ప్రకారం 2024-25 అన్ని రంగాల్లోని సీపీఎస్‌ఈలు కలిపి మొత్తం 15.42 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. 2023-24లో ఈ సంఖ్య 15.18 లక్షలుగా ఉంది. దీంతో పోల్చితే నియామకాల్లో కేవలం 1.61 శాతం పెరుగుదల మాత్రమే చోటు చేసుకుంది. ఈ స్వల్ప పెరుగుదలకు కూడా 54 వేల మందికి పైగా దినసరి కూలీలు, కాంట్రాక్ట్ కార్మికులను అధికంగా తీసుకోవడమే కారణం. ఇదే సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 30 వేలు తగ్గడం ఆందోళకరం. ఆర్థిక సంవత్సరం 2022-23 మినహా గత ఐదేండ్లుగా ఇదే ఒరవడి కొనసాగింది. వేతన ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన చెల్లింపుల భారం ప్రభుత్వ సంస్థలకు తగ్గుతుంది.
కాంట్రాక్ట్ కార్మికులే అధికం
2024-25లో పెట్రోలియం, రిఫైనరీ రంగాల విభాగంలో అత్యధికంగా 82 శాతం మంది కాంట్రాక్ట్, దినసరి కార్మికులే ఉన్నారు. ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ రంగాల్లో 63 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో 62 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరికి అరకొర జీతాలే అందిస్తున్నారు. ఫలితంగా ఆయా కార్మికులు సామాజిక భద్రతను కోల్పోతున్నారు. మరోవైపు పవర్ ట్రాన్స్‌మిషన్ విభాగంలో అత్యధికంగా 91 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండటం విశేషం.
నైపుణ్యం భళా…
సీపీఎస్‌ఈ రెగ్యులర్ ఉద్యోగాల్లో 83 శాతం లేదా 6.48 లక్షల మంది నైపుణ్యం కలిగిన వారేనని నివేదిక పేర్కొంది. పవర్ ట్రాన్స్‌మిషన్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో స్కిల్డ్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు. పారిశ్రామిక రంగం, కన్సూమర్ గూడ్స్, మార్కెటింగ్, బొగ్గు విభాగాల్లో తక్కువ నైపుణ్యం కలిగిన వారు ఎక్కువగా ఉన్నారు.
మహిళాల ఉపాధికి గండి
మొత్తం ఉపాధిలో మహిళల వాటా తగ్గడం ఆందోళకరం. 2024-25లో మొత్తం సిపిఎస్‌ఇల్లో మహిళా సిబ్బంది సంఖ్య 76,685కి పడిపోయింది 2023-24లో వీరి సంఖ్య 77,625గా ఉంది. సిపిఎస్‌ఇల్లో పని చేస్తున్న మహిళల్లో మూడో వంతు మంది మేనేజర్, ఎగ్జిక్యూటివ్ స్థాయిల్లో ఉండగా, 9 శాతం మంది సూపర్వైజరీ స్థాయిలో, మిగిలిన వారు వర్కర్లుగా ఉన్నారు. బొగ్గు, టెలికమ్యూనికేషన్, ఐటీ, రక్షణ రంగ ఉత్పత్తి విభాగాల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.



