Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్షిండే లెండి ప్రాజెక్టు గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది..

షిండే లెండి ప్రాజెక్టు గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మాజీ ఎమ్మెల్యే షిండే నిన్ను ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే లేండి ప్రాజెక్టు పూర్తి చేయని నీవు ఇప్పుడు లేండి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు అన్నారు. మా ఎమ్మెల్యే గెలిచిన 21 నెలలోనే లేండి ప్రాజెక్టు కోసం రూ.64 కోట్లు మంజూరు చేయించారని అన్నారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ విచారణ చేపట్టాలని ఆదేశించడంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలో ధర్నా, ఆందోళన చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ.. లేండి ప్రాజెక్టు నిర్మాణం గురించి నాకు ఆ తర్వాత కెసిఆర్ కు మాత్రమే తెలుసని అన్నారు.

నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా మద్నూర్ మండలంలోని హెచ్ కెలూరు చెరువు నింపి, లేండి కాలువల ద్వారా పంటలకు నీళ్లు అందించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఎందుకంటే ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి లేండి ప్రాజెక్టు గురించి ఒక్క పైసా కూడా నిధులు తేలేక, పనులు పూర్తి చేయలేక, ప్రజలు ఓడగొట్టిన తర్వాత లేండి గురించి షిండే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 21 నెలల కాలంలోనే వెనుకబడ్డ జుక్కల్ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంతారావు ఎంతో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. ఆయన చేసే అభివృద్ధి పనులకు షిండే ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.

విద్యాభివృద్ధి రోడ్ల అభివృద్ధి అనేక రంగాల్లో పట్టుదలతో పని చేస్తూ ప్రజల్లో పేరు ప్రతిష్టలు పొందుతున్న తోట లక్ష్మీ కాంతారావు గురించి షిండే మాట్లాడడం అతని చేతగాని పనికి నిదర్శనమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విట్టల్ గురూజీ, కొండ గంగాధర్, వట్నాల రమేష్ ,మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, దేవిదాస్ పటేల్, బండి గోపి, కర్ల సాయిలు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad