Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకం

పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకం

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  1976-77 పదవ తరగతి  పూర్వ విద్యార్థులు కలుసుకోవడం అభినందనీయమని పూర్వ విద్యార్థులు అన్నారు. బుధవారం లక్ష్మీ గార్డెన్స్ లో పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నలబది ఎనిమిది సంవత్సరాల తర్వాత విద్యార్థుల కలయిక ఆసక్తికరంగా మారిందని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు కలుసుకొని సమ్మేళనాలు నిర్వహించడం మానవ జీవన సాఫల్యతకు నిదర్శనమని కొనియాడారు. తాము చదువుకున్న 50 సంవత్సరాల తర్వాత 2027 లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అన్నవరం దేవేందర్,  వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లింగాల సాయిన్న, పోతారం మాజీ సర్పంచి బత్తిని సాయిలు, ఉల్లంపల్లి మాజీ సర్పంచ్ కైలాసం ,రీటైర్డ్ ఉపాధ్యాయులు పిన్నింటి బాల్ రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీవో నరసింహారెడ్డి, రిటైర్డ్ లైబ్రరీయన్ కొమ్మెర రవీందర్ రెడ్డి, రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ లింగమూర్తి, ఎల్ఐసి ఏజెంట్ దూడం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad