నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణను మొన్నటిదాకా భారీ వర్షాలు కుదిపేశాయి. ఆ వర్షాల తాకిడికి చేతికొచ్చిన పంటలన్నీ నీటి మునిగి రైతులను కూడా కన్నీటిలో ముంచేశాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణను చలి వణికిస్తోంది. ఉదయం 7 గంటలకు కూడా సూర్యుడు ఉదయించడం లేదు. పొద్దంతా ఎండ బాగా ఉంటోంది. కానీ సాయంత్రం 5 గంటల సమయానికే పొద్దుపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణలోని జిల్లాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ నెల 11 నుంచి రాష్ర్టవ్యాప్తంగా చలి గరిష్ట స్థాయిలో ఉండబోతోందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల లోపు ప్రజలు ఇండ్లలోకి చేరుకోవాలని వారు సూచించారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించి, చలి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండని తెలిపారు.
చలి మొదలైంది బాబోయ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



