– ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్రం అండ
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ముందు గౌతమ్ అదానీ పెద్ద వ్యాపారవేత్త ఏమీ కాదు. అయితే ఆ తర్వాత అదానీ ఎదుగుదలకు మోడీ ఎంతగానో సాయపడ్డారు. మోడీ అండదండలతోనే గౌతమ్ వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్న రీతిలో పెరిగిపోయింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ముందు వారిద్దరూ ఒకరికొకరు తెలియదు. కానీ 2002 మారణహోమం తర్వాత వారు బాగా సన్నిహితులయ్యారు. గుజరాత్ హింసను తమకు అందివచ్చిన గొప్ప అవకాశమని గౌతమ్ అదానీ, ఆ రాష్ట్రానికి చెందిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సభ్యులు భావించారు. గుజరాత్‌ను అప్రదిష్టపాలు చేయడానికి ఓ వర్గం ఏకమై ప్రయత్నిస్తోందని ఆరోపించిన వారందరూ ‘రిసర్జెంట్ గ్రూప్ ఆఫ్ గుజరాత్’ పేరిట సంఘటితమయ్యారు.
వీరికి నాయకత్వం వహించింది గౌతమ్ అదానీయే. 2003 సెప్టెంబర్-అక్టోబర్‌లో తొలి వైబ్రెంట్ గుజరాత్ సమావేశం జరిగినప్పుడు అదానీ తన సహచరుల కంటే ముందుగానే వెళ్లి రూ.150 బిలియన్ల పెట్టుబడులు అందిస్తానని హామీ ఇచ్చారు. మోడీ-అదానీ సంబంధాలలో ఇదో ముఖ్యమైన మలుపుగా నిలిచింది. అదానీ అందించిన మద్దతుకు ప్రతిఫలంగా మోడీ అనేక రకాలుగా సాయం చేశారు. తద్వారా గౌతమ్ వ్యాపారం అంచెలంచెలుగా ఎదగడానికి ఇతోధికంగా తోడ్పడ్దారు. 2008-11 మధ్యకాలంలో ముంద్రాలో అదానీ గ్రూప్ సెజ్‌కు 14 లీజ్ ఒప్పందాలు రిజిస్టర్ కాగా వాటిలో కేవలం ఒక యూనిట్‌కు మాత్రమే కలెక్టర్ అనుమతించారని కాగ్ ఎత్తిచూపింది. మిగిలిన 13 ఒప్పందాలలో భూమిని లీజు ద్వారా సక్రమంగా బదిలీ చేయలేదని ఆక్షేపించింది. అదానీ గ్రూప్ నుంచి అసాధారణ రీతిలో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేసినందుకు గుజరాత్ ప్రభుత్వంపై కూడా అక్షింతలు వేసింది.
ఏదేమైనా మోడీ, అదానీ మధ్య విడదీయరాని ఫెవికాల్ బంధం ఏర్పడింది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ దేశవ్యాప్తంగా జరిపిన ప్రచార యాత్ర కోసం అదానీ ఛార్టర్డ్ విమానాన్నే ఉపయోగించారు. మే 22న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున అదానీకి చెందిన ప్రైవేటు విమానంలోనే అహ్మదాబాద్ నుంచి న్యూఢిల్లీ వచ్చారు. ఇటీవల గౌతమ్ అదానీపై అమెరికా న్యాయస్థానంలో దాఖలైన కేసు విషయంలో కూడా మోడీ ప్రభుత్వం ఉదాశీనంగానే వ్యవహరిస్తోంది. ఆయనకు సమన్లు కూడా అందజేయకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదని సాక్షాత్తూ అమెరికా ప్రాసిక్యూటర్లే కోర్టుకు విన్నవించారు. ఇరువురి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అమెరికాలో జరుగుతున్న విచారణ నుంచి గౌతమ్ అదానీ తప్పించుకునేందుకు మోడీ సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు తేలాల్చిన విషయం.
అదానీకే పీఛే..
- Advertisement -
- Advertisement -